Intermediate supply exams postponed

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా
హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్‌బోర్డు మరోసారి వాయిదా వేసింది. జూన్‌ 7 నుంచి 14 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 15 నుంచి 18 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌, జూన్‌ 19న నైతిక, మానవ విలువలు, జూన్‌ 20న పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించనున్నారు. తొలుత వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లడంతో రాష్ట్రంలో పెను రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో జవాబుపత్రాలను పునఃమూల్యాంకన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలను మరోసారి వాయిదా పడ్డాయి.

సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌.

Intermediate supply time table

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మళ్లీ వాయిదా

Leave a Reply